లంకేయుల తొలి విజయం.. నెదర్లాండ్స్‌పై గెలుపు!
వన్డే వరల్డ్ కప్‌లో బలమైన సౌతాఫ్రికాకు షాకిచ్చిన నెదర్లాండ్స్ అదే జోరును కొనసాగించలేకపోయింది. శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఓటమిపాలైంది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 262 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్ల ధాటికి ఆ జట్టు ఆ మాత్రం స్కోరు కూడా చేస్తుందని ఎవరూ అనుకోలేదు. అయితే చివర్లో సైబ్రాడ్ ఎంగిల్బ్రెట్ (70), లోగన్ వాన్ బీక్ (59) ఆ టీంను ఆదుకున్నారు. లంక బౌలర్లలో దిల్షాన్ మధుష్క, కాసున్ రజత చెరో నాలుగు వికెట్లతో మెరిశారు. ఇక ఛేజింగ్‌లో శ్రీలంకకు మంచి ఆరంభమే దక్కింది. పాథుమ్ నిస్సంక (54) ఆకట్టుకున్నాడు. అయితే మిగతా టాపార్డర్ విఫలమైంది. ఇలాంటి సమయంలో సదీర సమరవిక్రమ (91 నాటౌట్) జట్టును ముందుండి నడిపించాడు. చరిత్ ఆశలంక (44), ధనంజయ డిసిల్వ (30) అతనికి కొంత సహకారం అందించారు. దీంతో సమరవిక్రమ అద్భుతంగా పోరాడి శ్రీలంకను విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచులో ఐదు వికెట్ల తేడాతో లంకేయులు విజయం సాధించారు. నెదర్లాండ్స్ బౌలర్లలో ఆర్యన్ దత్ మూడు వికెట్లతో మెరిశాడు. అయితే బ్యాటుతో రాణించి, అజేయంగా నిలిచి లంకను గెలిపించిన సమరవిక్రమకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













