మోడీ ఓ దేశద్రోహి .. రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్..!
కేంద్రప్రభుత్వం, ప్రధాని మోడీపై విపక్ష ఇండియా కూటమి పోరాటం కొనసాగుతోంది. ఆందోళనలు, నిరసనలకు తాత్కాలిక విరామమిచ్చిన కాంగ్రెస్.. ఆరోపణల్లో మాత్రం ఇంచి కూడా తగ్గడంలేదు. ప్రధాని మోడీ, అమిత్ షా తమ తర్వాతి టార్గెట్ అని ప్రకటించిన రాహుల్.. ఆ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నారు. దానిలో భాగంగా లేటెస్టుగా ప్రధాని మోడీ.. దేశద్రోహి అంటూ తీవ్ర పదజాలాన్ని వాడారు రాహుల్ గాంధీ.
ప్రధాని మోడీ.. ఓ ‘దేశద్రోహి’ అని, ఆయన్ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రిస్తున్నారని, తనతో చర్చకు వస్తే ఆ విషయాన్ని 5 నిమిషాల్లో నిరూపిస్తానన్నారు రాహుల్. ఈ అంశంపై చర్చకు రావాలని ప్రధానికి సవాల్ విసిరితే పార్లమెంటులో చర్చిద్దామని ఎన్డీయే నేతలు అంటున్నారని చెప్పారు. కానీ లోక్సభలో తాను మాట్లాడకుండా మైక్ కట్ చేస్తారని రాహుల్ తెలిపారు.
ఇవి కూడా చదవండి
దేశంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు షా మూడేళ్ల గడువు పెట్టారని, అయితే అప్పటికి ఆయన ఆ పదవిలో ఉంటారో? లేదో? అని రాహుల్ ఎద్దేవా చేశారు. తన అంచనా ప్రకారం ఏడాదిలోపే ప్రభుత్వం కూలిపోతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను అమిత్ షాను ఒక్కటే అడగాలనుకుంటున్నా. అదానీ ఓడరేవులో పట్టుబడిన మాదకద్రవ్యాల సంగతేంటి? ఆ విషయంలో మీరు తీసుకున్న చర్యలేమిటి? మీరు శాంతిభద్రతల గురించి మాట్లాడుతున్నారు. మీరు గ్యాంగ్స్టర్లను ప్రోత్సహిస్తున్నారని దేశం మొత్తానికి తెలుసు. ఒకవేళ మీరు శాంతిభద్రతల గురించి మాట్లాడాలనుకుంటే, మణిపుర్లో ఏం జరుగుతుందో దేశానికి చెప్పండి’’ అని రాహుల్ అన్నారు.







