చేతిలో నిమ్మ కాయలు పడితే… టిక్కెట్ వచ్చినట్లే.. అక్కడ అదో ఆచారం
ఎన్నికల నగారా మోగగానే ఆశావహులు, సిట్టింగ్ అభ్యర్థులు అలర్ట్ అయిపోతారు. మళ్లీ తనకే టిక్కెట్ ఇవ్వాలని సిట్టింగులు, కొత్తవారు కూడా పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి లేదా ప్రధాని ముందు వాలిపోతారు. వారి వారి ప్రొఫైల్స్ ను చూసి అధిష్ఠానం వారిని ఎంపిక చేస్తుంది. పనితీరు, మాట తీరు, అభివృద్ధి చేసిన తీరు, ప్రజల్లో కలుపుగోలుతనం.. ఇవేమిటి… సవాలక్ష విషయాలను పరిగణనలోకి తీసుకొని టిక్కెట్ ఇస్తారు. అయితే.. పుదుచ్చేరిలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వుంటుంది. పుదుచ్చేరి ఎన్నార్ కాంగ్రెస్ విభిన్నమైన విధానంతో ముందుకు వస్తుంది. ముఖ్యమంత్రి రంగసామి ఓ వినూత్న విధానంతో టిక్కెట్లను ఖరారు చేస్తారట. ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి
పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రంగసామి మొదట తన ఇంటి సమీపంలోని అప్పా పైత్తియ సామి ఆలయానికి వెళ్తారు. ఆశావహులు కూడా అక్కడికే వెళ్తారు. రంగసామి తన నామినేషన్ పత్రాలను అందించి, బయటికి వస్తారు. తర్వాత గర్భగుడిలో రంగసామి ఏకంతంగా వుంటారు. అభిషేకం, పూజలు చేస్తారు. ఇవి పూర్తైన తర్వాత బయటికి వచ్చి, నియోజక వర్గానికో అభ్యర్థికి విబూది పెట్టి, నిమ్మకాయలు అందిస్తారు. ఈ సమయంలో ఎవరికి విబూతి పెట్టి, నిమ్మకాయలు ఇస్తారో… వారికే టిక్కెట్లు లభిస్తాయి. ఆ వ్యక్తే ఆయా నియోజకవర్గ ఎన్నార్ కాంగ్రెస్ అభ్యర్థి అన్నమాట. పైత్తియ స్వామి ఆశీస్సులు వున్న వారికే సీఎం రంగసామి ఇలా నిమ్మకాయలు ఇస్తారని వారు బలంగా నమ్ముతారు. 2011 నుంచీ ఈ పద్ధతి అవలంబిస్తున్నారు. తాజాగా కూడా రంగసామి ఇలానే చేశారు.
ఇవి కూడా చదవండి








