నాలుగేళ్లలో 58 దేశాలు పర్యటనలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 నుంచి 2019 వరకు 58 దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.517.82 కోట్లు ఖర్చు చేసింది. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ రాజ్యసభకు లిఖితపూర్వకంగా తెలియజేశారు. ప్రధాని మోదీ అమెరికా, రష్యా, చైనా దేశాల్లో ఐదు పర్యాయాల చొప్పున పర్యటించారు. సింగపూర్, జర్మనీ, ఫ్రాన్సు, శ్రీలంక, యూఏఈ తదితర దేశాలకు ఒకటి కంటే ఎక్కువసార్లు వెళ్లొచ్చారు. ప్రధానమంత్రి పర్యటనల వల్ల విదేశాలతో వ్యాపారం, వాణిజ్యం, సాంకేతిక, రక్షణ తదితర రంగాల్లో భారత్ సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయని వి.మురళీధరన్ చెప్పారు.













