వరల్డ్ కప్‌లో బోణీ కొట్టిన పాక్.. సమిష్టిగా రాణించిన బౌలర్లు
వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ తొలి విజయం నమోదు చేసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన తమ తొలి మ్యాచ్‌లో ఏకంగా 81 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ జట్టు 285 పరుగులకు ఆలౌట్ అయింది. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి పాక్ టాపార్డర్ కుప్పకూలింది. అయితే మహమ్మద్ రిజ్వాన్ (68), సౌద్ షకీల్ (68) ఇద్దరూ ఆ జట్టును ఆదుకున్నారు. చివర్లో మహమ్మద్ రిజ్వాన్ (32), షాదాబ్ ఖాన్ (38) కూడా ఫర్వాలేదనిపించారు. నెదర్లాండ్స్ ఆల్‌రౌండర్ బాస్ డి లీడ్స్ నాలుగు వికెట్లతో రాణించాడు. ఇక లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్ మాక్స్ ఓ వుడ్ (5)తోపాటు కోలిన్ ఆకర్మన్ (17) కూడా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ విక్రమ్ జీత్ సింగ్ (52), బంతితో చెలరేగిన బాస్ డి లీడ్స్ (67) బ్యాటుతోనూ రాణించాడు. చివర్లో లోగన్ వాన్ బీక్ (28 నాటౌట్) కూడా పోరాడాడు. కానీ వారికి సరైన సహకారం లభించలేదు. పాక్ బౌలర్లు అందరూ సమిష్టిగా రాణించడంతో నెదర్లాండ్స్ 41 ఓవర్లలో కేవలం 2015 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో పాకిస్తాన్ నెట్ రన్ రేట్ కూడా మెరుగ్గా కనిపిస్తోంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న పాక్ బ్యాటర్ సౌద్ షకీల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.













