సౌతాఫ్రికాకు షాకిచ్చి చరిత్ర సృష్టించిన నెదర్లాండ్స్
వన్డే వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. బలమైన సౌతాఫ్రికాకు పసికూన నెదర్లాండ్స్ షాకిచ్చింది. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచును వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ 245 పరుగులు చేసింది. ఆ టీం కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (78 నాటౌట్) అద్భుతమైన పోరాట పటిమ కనబరిచాడు. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా బాగా తడబడింది. డేవిడ్ మిల్లర్ (43), కేశవ్ మహరాజ్ (40) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు ఎవరూ అంత గొప్పగా రాణించలేదు. దీంతో ఆ జట్టు 42.5 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. టెస్టులు ఆడని దేశం చేతిలో ఓడిపోవడం సౌతాఫ్రికాకు ఇదే తొలిసారి. అదే సమయంలో టెస్టులు ఆడే దేశంపై గెలవడం నెదర్లాండ్స్‌కు ఇదే మొదటి సారి కూడా.













