ఎన్నికల ప్రచారంపై.. మమత కీలక నిర్ణయం
కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా నమోదు అవుతున్న తరుణంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఎన్నికల ప్రచారం నిర్వహించొద్దని మమత నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రెయిన్ ట్వీట్ చేశారు. మమతా బెనర్జీ కోల్కతాలో ఇకపై ఎన్నికల ప్రచారం చేయరు. ప్రచారం చివరి రోజు ఏప్రిల్ 26న కోల్కతాలో సాధారణ సమావేశాన్ని మాత్రమే నిర్వహిస్తారు. జిల్లాల్లో నిర్వహించే ప్రచార సభలను కూడా 30 నిమిషాలకే పరిమితం చేస్తున్నట్లు ఓబ్రెయిన్ పేర్కొన్నారు.













