Manipur: మణిపూర్ కొత్త సీఎంగా ఖేమ్‌చంద్ సింగ్!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో (Manipur) సుమారు ఏడాది తర్వాత రాష్ట్రపతి పాలన ఎత్తివేశారు. అనంతరం మణిపూర్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత యుమ్నాం ఖేమ్‌చంద్ సింగ్ (Yumnam Khemchand Singh) బుధవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇంఫాల్‌లోని లోక్ భవన్లో జరిగిన వేడుకలో గవర్నర్ అజయ్ భల్లా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త ప్రభుత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మంత్రివర్గ విస్తరణలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మణిపూర్ (Manipur) చరిత్రలోనే తొలిసారి డిప్యూటీ సీఎం పదవిని ఒక మహిళకు కట్టబెట్టారు. కుకీ సామాజిక వర్గానికి చెందిన నెమ్చా కిప్జెన్ (Nemcha Kipgen) డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. అయితే స్థానిక సంఘాల హెచ్చరికలు, భద్రతా కారణాల రీత్యా ఆమె స్వయంగా ఇంఫాల్‌కు రాలేకపోయారు. దీంతో ఆమె ఢిల్లీలోని మణిపూర్ భవన్ నుండే వర్చువల్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమెతో పాటు లోసీ డిఖో కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎం ఖేమ్‌చంద్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని (Manipur) 36 సామాజిక వర్గాలను కలుపుకుపోతూ, శాంతిని నెలకొల్పడమే తమ ప్రథమ లక్ష్యమని స్పష్టం చేశారు. హోంమంత్రిగా గోవిందాస్ కొంతౌజం కూడా ఇదే వేడుకలో ప్రమాన స్వీకారం చేశారు.






