ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం .. కేజ్రీవాల్, కవిత పేర్లు
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో సంచలనం చోటు చేసుకుంది. లిక్కర్ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ రెండో ఛార్జ్షీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట పేర్లున్నాయి. సమీర్ మహేంద్రు స్టేట్మెంట్లో కేజ్రీవాల్ పేరు వెల్లడైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఈడీ చార్జిషీట్లో మరోసారి ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించారు. ఇప్పటికే విచారించిన వారిలో కవిత పేరును ప్రస్తావించారు. అలాగే ఆధారాలను ధ్వసం చేసిన వారిలో కూడా కవిత పేరును ప్రస్తావించారు. ఢిల్లీ ఒబెరాయ్ హోటల్లో జరిగిన సమావేశాల్లో కవిత పాల్గొన్నట్లుగా ఛార్జిషీట్లో ఈడీ అధికారులు తెలిపారు. మొత్తం 17 మంది నిందితులపై ఈడీ అభియోగాలు మోపింది. మొత్తం 428 పేజీల చార్జ్‌షీట్‌లో మద్యం కుంభకోణం ఎక్కడ మొదలయింది? ఎవరెవరు పాత్రాధారులన్నది వివరంగా తెలిపింది.













