మా యాప్స్ ను ఎందుకు నిషేధించారు?
భారత్‌లో 59 చైనా యాప్స్‌పై నిషేధానికి సంబంధించి.. ఇటీవల సైన్యాధికారుల చర్చల్లో భాగంగా డ్రాగన్ దేశం ప్రశ్నలు లేవనెత్తింది. వాస్తవాదీన రేఖ వెంబడి ఉద్రిక్తతను తగ్గించడంలో భాగంగా జరిగిన ఈ చర్చల్లో.. యాప్స్ విషయాన్ని చైనా ప్రస్తావించగానే. భారత్ అధికారులు దీటుగా సమాధానం చెప్పినట్లు తెలిసింది. దేశభద్రత, సార్వభౌమత్వం, సమగ్రత నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ 59 యాప్స్ ద్వారా మా దేశ పౌరుల వ్యక్తిగత సమాచారం లీకవుతోంది. దేశ భద్రతకూ ముప్పు ఉంది అని చెప్పినట్లు సమాచారం. కాగా భారత్, చైనాలకు చెందిన లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారుల మధ్య నాలుగో విడత చర్చలు జరగనున్నాయి. సరిహద్దులో సైన్యాలను వెనక్కి పంపించడం. లద్దాఖ్‌లో పరిస్థితులపై చర్చించనున్నారు.













