ఐటీ దిగ్గజం కాప్జెమిని గుడ్ న్యూస్
ఫ్రాన్స్ ఐటీ దిగ్గజం కాప్జెమిని ఈ ఏడాది భారత్‌లో దాదాపు 60 వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నది. ఇది గతేడాదితో పోలిస్తే చాలా ఎక్కువే. డిజిటల్ ఆధారిత సొల్యూషన్స్‌కు డిమాండ్ అంతకంతకు పెరుగుతున్నదని కాప్జెమినీ ఈసీవో అశ్విన్ యాద్రి తెలిపారు. డిజిటల్ ఆధారిత సొల్యూషన్స్‌పై పట్టు ఉన్న నిపుణులు ఇప్పుడు చాలా అవసరం అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 3.25 లక్షల మంది ఉద్యోగులు కాప్‌జెమినీలో సేవలందిస్తుంటే, అందులో సగం భారత్‌లోనే ఉన్నారు. ఫ్రెషర్స్ అటుపై ప్రతిభావంతులను నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తామని సంస్థ చెబుతున్నది.








