Night Terror: పిల్లల్లో ‘నైట్ టెర్రర్’ సమస్య.. భయపడాల్సిన పనిలేదన్న డాక్టర్!

ఇటీవల సోషల్ మీడియాలో ఒక చిన్నారికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో నిద్రిస్తున్న ఒక పాప అకస్మాత్తుగా అర్ధరాత్రి నిద్రలో (Night Terror) నుంచి లేచి, ఏదో చూసి భయపడుతున్నట్లుగా గట్టిగా ఏడుస్తూ కనిపిస్తుంది. ప్రతిరోజూ ఆ చిన్నారి పరిస్థితి ఇలాగే ఉండటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ స్పందిస్తూ.. ఇది ‘నైట్ టెర్రర్’ (Sleep Terror) లేదా ‘స్లీప్ పారాసోమ్నియా’ అనే సమస్య అని వివరించారు. ఈ పరిస్థితి పట్ల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని ఆయన స్పష్టం చేశారు.
అసలు నైట్ టెర్రర్ అంటే ఏమిటి?
సాధారణంగా 3 నుంచి 12 ఏళ్ల వయసున్న చిన్నారుల్లో ఈ (Night Terror) సమస్య ఎక్కువగా కనిపిస్తుందని డాక్టర్ సుధీర్ తెలిపారు. దీనిని ‘నాన్-ర్యాపిడ్ ఐ మూవ్మెంట్’ (NREM) స్లీప్ పారసోమ్నియా అని పిలుస్తారు. పిల్లలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు (సాధారణంగా రాత్రి 11 గంటల సమయంలో) అకస్మాత్తుగా లేచి కూర్చుంటారు. భయంతో గట్టిగా అరుస్తూ, చెమటలు పట్టి, కళ్లు పెద్దవి చేసి ఒకవైపు చూస్తుంటారు. ఈ సమయంలో మనం వారిని ఎంత ఓదార్చినా, పిలిచినా వారు స్పందించరు. నిజానికి వారు అప్పుడు పూర్తి మెలకువతో ఉండరు, అలాగని నిద్రలోనూ ఉండరు. చిత్రమైన విషయం ఏమిటంటే.. మరుసటి రోజు ఉదయం నిద్రలేచాక రాత్రి జరిగిన (Night Terror) సంఘటన గురించి వారికి ఏమీ గుర్తుండదు.
తల్లిదండ్రులు చేయకూడని పనులు:
పిల్లలు అలా భయంతో అరుస్తున్నప్పుడు తల్లిదండ్రులు కంగారుపడి వారిని బలవంతంగా నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంటారు. డాక్టర్ సుధీర్ కుమార్ అభిప్రాయం ప్రకారం.. ఇది ఏమాత్రం మంచిది కాదు. వారిని నిద్రలేపడం (Night Terror) వల్ల వారు మరింత గందరగోళానికి, ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో వారిని పట్టుకుని ఆపడం కంటే, పిల్లలు గాయపడకుండా చుట్టుపక్కల ఉన్న వస్తువులను తొలగించడం ముఖ్యం. వారు అటూ ఇటూ తిరుగుతుంటే కాళ్లకు ఏవైనా అడ్డంకులు ఉంటే తీసేయాలి. నిశ్శబ్దంగా ఉంటూ వారిని మళ్లీ నెమ్మదిగా నిద్రలోకి జారుకునేలా చూడాలి.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సమస్యను పరిష్కరించే మార్గాలు:
నైట్ టెర్రర్ (Night Terror) సమస్య రావడానికి ప్రధాన కారణం పిల్లలు పగలు ఎక్కువగా అలసిపోవడం లేదా నిద్రవేళల్లో మార్పులు ఉండటం. కాబట్టి పిల్లలు ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయేలా చూడాలి. ఒకవేళ ప్రతిరోజూ ఒకే సమయానికి (ఉదాహరణకు రాత్రి 11 గంటలకు) ఈ సమస్య తలెత్తుతుంటే, దానికి ఒక 15-30 నిమిషాల ముందే పిల్లలను మెల్లగా నిద్రలేపాలి. ఇలా కొన్ని రోజుల పాటు చేయడం వల్ల వారి ‘స్లీప్ సైకిల్’ రీసెట్ అవుతుంది. తద్వారా ఆ భయానక అనుభవాలు క్రమంగా తగ్గిపోతాయి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి?
చాలా వరకు ఈ సమస్య (Night Terror) వయసు పెరుగుతున్న కొద్దీ దానంతట అదే తగ్గిపోతుంది. దీనికి ప్రత్యేకమైన మందులు అవసరం లేదు. కానీ పిల్లల ప్రవర్తన నిద్రలో హింసాత్మకంగా మారుతున్నా, లేదా వారు తమను తాము గాయపరుచుకుంటున్నా ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి సలహా తీసుకోవాలి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే పిల్లల్లో నిద్రకు సంబంధించిన ఈ సమస్యలను సులభంగా అధిగమించవచ్చని డాక్టర్ సుధీర్ కుమార్ సూచించారు.
https://x.com/hyderabaddoctor/status/2024028363162337701











































































