ఇంగ్లిష్ సినిమాలు చూస్తే … ఆ దేశంలో జైలుకే
ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్ ఉన్ నిర్ణయాలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. ఈ వైచిత్రి రోజు రోజుకూ మరింత పెరుగుతుండటంతో ఉత్తర కొరియా వాసులు నరకం అనుభవిస్తున్నారు. తాజాగా కిమ్ దృష్టి హాలీవుడ్ సినిమాలపై పడింది. ఈ సినిమాల ప్రభావంతో ఎవరైనా తిరుగుబాటు లేవదీస్తారన్న అనుమానంతో ఏకంగా నిషేధమే విధించారు. హాలీవుడ్ లేదా విదేశీ సినిమాలను చూస్తూ దొరికితే ఆ పిల్లల తల్లిదండ్రులను ఏకంగా జైలుకు పంపిస్తామని ప్రకటించారు. మొదటి తప్పుగా తల్లిదండ్రులను కార్మిక శిబిరాలకు తరలించి, ఆరు నెలలపాటు అక్కడే ఉంచుతారు. పిల్లలనూ వదలకుండా అయిదేళ్లు శిక్ష విధించి శిబిరాలకు పంపుతారు. పిల్లలకు తల్లిదండ్రులు ఉత్తర కొరియా విశిష్టత గురించి తెలియజేయాలని. అలా చేయకపోతే వారు సామ్యవాద వ్యతిరేకులుగా మారే ప్రమాదముందని అధికారులు పేర్కొంటున్నారు.













