మానవహక్కుల చర్చకు భారత్ దూరం
చైనాలోని షిన్ జియాంగ్ ప్రాంతంలో మానవహక్కుల పరిస్థితిపై చర్చకు గాను ఐరాస మానవహక్కుల మండలి రూపొందించిన ముసాయిదా తీర్మానంపై ఓటింగుకు భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ భూభాగంలో ఏళ్ల తరబడి మానవహక్కుల పరిస్థితి దారుణంగా తయారైందని, పున విద్యా శిబిరాలు పేరిట బీజింగ్ పది లక్షకు పైగా వీగర్స్ (మైనార్టీలు)ను నిర్బంధించిందని అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతోంది. 47 మంది సభ్యులున్న భద్రతాతమండలిలో ఈ ముసాయిదా తీర్మానం వీగిపోయింది. ఇది చైనాకు దౌత్యపరమైన విజయంగా చెప్పవచ్చు. 17 ఓట్లు తీర్మానానికి అనుకూలంగా రాగా, చైనాతో పాటు 19 దేశాలు వ్యతిరేకించాయి. భారత్, బ్రెజిల్, మెక్సికో, ఉక్రెయిన్ తదితర 11 దేశాలు ఓటింగుకు దూరంగా ఉండిపోయాయి.













