రష్యాకు వ్యతిరేకంగా ఐరాస తీర్మానం.. రష్యాకు భారత్ దూరం
ఐరాస సర్వసభ్య సమావేశంలో రష్యాకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ మరోసారి దూరంగా ఉంది. ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, డొనెట్స్క్, ఖేర్సన్, జపోరిజియా ప్రాంతాలను రష్యాలో విలీనం చేసుకోవడాన్ని ఖండిస్తూ ఆల్బానియా తీర్మానం ప్రతిపాదించింది. దీనిపై ఓటింగ్ చేపట్టగా 143 దేశాలు అనుకూలంగా ఓటేశాయి. రష్యా, బెలారస్, ఉత్తరకొరియా, సిరియా, నికరగువా దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్ సహా 35 దేశాలు ఈ ఓటింగ్‌కు గైర్హాజరయ్యాయి. చైనా, క్యూబా, పాకిస్థాన్, దక్షిణాప్రికా, శ్రీలంక, థాయ్‌లాండ్, వియత్నాం దేశాలు కూడా ఓటింగ్‌లో పాల్గొనలేదు. అత్యధిక దేశాలు మద్దతివ్వడంతో ఈ తీర్మానాన్ని ఐరాస ఆమోదించింది.













