ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..! మద్దతు ప్రకటించిన అరబ్ పార్టీలు..!
ఇజ్రాయెల్ లో ప్రభుత్వం మారనుంది. ఇరాన్ యుద్ధం, ఇతరత్రా విధానాల్లో బెంజమిన్ నెతన్యాహు ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్న ఇజ్రాయెల్ ఓటర్లు.. సంకీర్ణానికి మద్దతు పలికారు. దీంతో హంగ్ రాజకీయం ఏర్పడింది. ఇలాంటి కీలక సమయంలో 19 సీట్లు గెల్చుకున్న అరబ్ పార్టీలు.. ఐసెన్ కోట్ కు మద్దతు పలికాయి. గురువారం అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్‌తో జరిపిన చర్చల సందర్బంగా అరబ్ పార్టీలు ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను ముందుంచాయి.
అక్టోబర్ 27వ తేదీన జరిగిన ఎన్నికల్లో 120 మంది సభ్యులుండే నెసెట్‌లో ప్రధాని నెతన్యాహూ కూటమికి 53 సీట్లు రాగా, ఐసెన్‌కోట్ వర్గానికి 48 సీట్లు దక్కాయి. నెసెట్‌లో మెజారిటీకి 61 సీట్లు అవసరం. దీంతో, ఈ దఫా రికార్డు స్థాయిలో 19 సీట్లు గెలుచుకున్న అరబ్ పార్టీల కూటమి మద్దతు కీలకంగా మారింది. ఇదే సమయంలో, తాము ఎవరికీ మద్దతివ్వబోమని నెతన్యాహూకు మిత్ర పక్షం యునైటెడ్ తోరాహ్ జుడాయిజం(యూటీజే)ప్రకటించడంతో ఆయనకు దారులు పూర్తిగా మూసుకుపోయినట్లయింది.
ఇవి కూడా చదవండి
నెతన్యాహూ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలన్న లక్ష్యంతోనే ఐసెన్కోట్కు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నామని అరబ్ పార్టీల కూటమి ‘జాయింట్ లిస్ట్’లోని రామ్ పార్టీ నేత మన్సూర్ అబ్బాస్ చెప్పారు. జాయింట్ లిస్ట్ ప్రకటనతో ఐసెన్కోట్కు 67 మంది సభ్యుల మద్దతు లభిస్తుంది. రెండు దేశాల విధానానికి, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గాజా శాంతి ప్రణాళికకు తాము కట్టుబడి ఉంటామని అబ్బాస్ చెప్పారు. ప్రస్తుత నెతన్యాహూ ప్రభుత్వంలో అరబ్బులు వివక్షను, జాతి వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని, ఈ విషయంలో తాము మార్పును కోరుకుంటున్నామని జాయింట్ లిస్ట్ చైర్మన్ యూసెఫ్ జబరీన్ వివరించారు.
అదే సమయంలో, అరబ్బులపై వివక్ష సహా అనేక అంశాల్లో ఐసెన్కోట్తో తమకు అనేక అంశాల్లో విభేదాలు ఉన్న విషయమై వాస్తవమేనని ఆయన వ్యాఖ్యానించారు. ‘మంచి, చెడు మధ్య ఏది ఎంచుకోవాలన్న అవకాశం మాకు లేదు. మాకు ఉన్నదల్లా చెడు, అంతకుమించిన చెడు మధ్య ఎంపిక చేసుకునే అవకాశం మాత్రమే’అంటూ జబరీన్ వ్యాఖ్యానించారు. జాయింట్ లిస్ట్ బయటి నుంచి ఐసెన్‌కోట్ సారథ్యంలోని మైనారిటీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తుందని మరో అరబ్ సీనియర్ నేత అహ్మద్ టిబి చెప్పారు







