ఉక్రెయిన్ ప్రభుత్వం చేతుల్లో… ఆ దేశ సైనికులే 40 మంది
మన తీసుకున్న గొయ్యిలే మనమే పడడం అనే సామెత ఉంది. కదా. ఉక్రెయిన్ ప్రభుత్వం చేతుల్లో ఆ దేశ సైనికులే 40 మంది చనిపోవడం ఈ సామెతను సరిగా నిరూపించింది. ఇంతకి ఏమి జరిగింది అంటే ఉక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్ల ఒక జైలులో ఉన్న 40 మంది ఉక్రెయిన్ సైనికులు మరణించారని రష్యా మద్దతు గల వేర్పాటువాదుల ప్రతినిధి తెలిపారు. ఈ ఘటనలో 130 మంది గాయపడ్డారని కూడా తెలిపారు. ఉక్రెయిన్పై కొన్ని నెలలుగా రష్యా దండయాత్ర చేస్తూనే ఉంది. ఈ క్రమంలో రష్యా మద్దతు గత వేర్పాటు వాద ప్రతినిధి కీలక విషయాన్ని వెల్లడించారు. మరియపోల్ ప్రాంతంలో జరిగిన యుద్దం తరువాత అరెస్టైన ఉక్రెయిన్ సైనికుల్లో 40 మంది మరణించారని, 130 మంది గాయపడ్డారని తెలియజేశారు. అయితే వారంతా ఉక్రెయిన్ చేసిన బాంబు దాడి వల్లే చనిపోయారని తెలిపారు. ఒలెనివ్కా పట్టణంలోని జైలుపై షెల్లింగ్ జరిపినట్లు డొనెట్స్క్లోని వేర్పాటువాదుల ప్రతినిధి డానిల్ బెసోవోవ్ వెల్లడించారు. దీనిపై ఉక్రెయిన్ అధికారుల నుంచి ప్రతిస్పందన ఏదీ లేదు.













