కెనడాలో కలవరం.. రహస్య ప్రాంతానికి ప్రధాని!
కెనడాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధాని జస్టిస్ ట్రూడో ఆయన కటుంబంతో కలిసి ఓ రహస్య ప్రాంతానికి వెళ్లారు. కరోనా కట్టడికిగానూ ప్రభుత్వం విధించిన ఆంక్షలు, నిబంధనలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారే అవకాశముండటంతో ప్రధాని కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించాలని భద్రత వర్గాలు నిర్ణయించాయి. కరోనా వ్యాక్సిన్లు తీసుకొని ట్రక్కు డ్రైవర్ల నుంచి నిరసన వెల్లువెత్తింది. కెనడా వ్యాప్తంగా ట్రక్కు డ్రైవర్లు భారీ ర్యాలీగా రాజధానిని ఒట్టావాకు బయలుదేరారు. దీంతో రాజధానికి వెళ్లే రహదారులన్నీ ట్రక్కు కాన్వారులతో కిక్కిరిసిపోయాయి. ఫ్రీడం కాన్వయ్ పేరుతో తరలిస్తున్న ఈ ట్రక్కులన్ని ఒట్టావాలోని ప్రవేశిస్తే హింస మరింత పెరిగే అవకాశముండటంతో ముందు జాగ్రత్తగా భద్రతా వర్గాలు ప్రధాని కుటుంబాన్ని రహస్య ప్రాంతానికి తరలించాయి.













