బ్రిక్స్ ను ఏకతాటిపైకి తెచ్చి మరీ ‘‘ఢిల్లీ డిక్లరేషన్’’ ఆమోదింపజేసిన భారత్
భారత దేశం అతి పెద్ద దౌత్య విజయం సాధించింది. ‘‘ఢిల్లీ డిక్లరేషన్’’ కి బ్రిక్స్ దేశాలు ఆమోదించాయి. ఈ విషయాన్ని ప్రధాని మోదీ ప్రకటించారు. విభేదాలు పక్కన పెట్టి మరీ, ఇరాన్ సహా యూఏఈ, సౌదీ అరేబియా ఈ డిక్లరేషన్ కి ఆమోదం తెలిపాయి. నిజానికి పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ఇరాన్, యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయినా సరే.. భారత దౌత్యపరమైన నైపుణ్యంతో ఈ డిక్లరేషన్ కి ఆమోదం తెలపడం విశేషం.
పశ్చిమాసియా పరిణామాలపై బ్రిక్స్ కూటమి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఏ రకమైన సమస్యకూ యుద్ధం పరిష్కారం కాదని స్పష్టం చేసింది. శాంతిని నెలకొల్పడానికి నిరంతర చర్చలు, దౌత్య మార్గాలే ఏకైక పరిష్కారమని సభ్య దేశాలు తేల్చిచెప్పాయి.
అసలు ‘‘న్యూ ఢిల్లీ డిక్లరేషన్’’ అంటే ఏమిటి?
1.పశ్చిమాసియా సంక్షోభం సహా ఎలాంటి అంతర్జాతీయ సమస్యలకైనా యుద్ధం పరిష్కారం కాదని, దౌత్య మార్గాలు, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని స్పష్టం చేశారు. ఏకపక్ష యుద్ధ చర్యలను ఖండిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
2.ఐరాస (UNSC) సంస్కరణలు: మారుతున్న, వర్తమాన ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (UN Security Council) తక్షణ సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
3.3. మానవాభివృద్ధే ప్రాధాన్యం: భారత్ నేతృత్వంలో ఈ సదస్సు ‘Humanity First’ (మానవాభివృద్ధే ప్రథమం) ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని తీర్మానించారు.
4.4. ఆర్థిక సవాళ్లు, డిజిటల్ సహకారం: ప్రపంచ సరఫరా వ్యవస్థలను (Supply Chains) బలపరచడం, ఆహార-ఇంధన భద్రత, స్థానిక కరెన్సీల ద్వారా వ్యాపారాన్ని పెంపొందించడం వంటి ఆర్థిక అంశాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది.








