ఆస్ట్రేలియాలో కొత్త చట్టం.. అక్రమ వలసదారులకు
నేర చరితులైన వలసదారులు వీసా నిబంధనలను ఉల్లంఘిస్తే అయిదేళ్ల వరకు జైలు శిక్ష విధించడానికి వీలుకల్పించే చట్టాన్ని ఆస్ట్రేలియా తెచ్చింది. విదేశీయులను నిరవధికంగా జైలులో నిర్బంధించకూడదని గతవారం హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం అత్యవసరంగా ఈ చట్టం చేసింది. హత్య, లైంగిక అత్యాచారం వంటి కేసులను ఎదుర్కొంటున్న 84 మంది విదేశీయులను హైకోర్టు తీర్పుతో విడిచిపెట్టాల్సి వచ్చింది. వీరిలో అఫ్గాన్లు, ఇరానియన్లు కూడా ఉన్నారు. విడుదలైన వారంతా ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సాధనాలను ధరించాలనీ, కర్ఫ్యూ నిబంధనలను పాటించాలని కొత్త చట్టం నిర్దేశిస్తోంది. దీన్ని అతిక్రమించినవారు అయిదేళ్ల వరకు జైలు శిక్షకు గురవుతారు. బోట్లలో వచ్చే అక్రమ వలసదారులను పసిఫిక్ మహాసముద్రంలోని ఒక దీవిలో ఆస్ట్రేలియా నిరవధికంగా నిర్బంధించేది. దాంతో బోట్లలో వలసదారుల ప్రవాహం ఆగింది.













