భారత్ -పాక్ సరిహద్దు వద్ద.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ఎన్‌వీ రమణ తన కుటుంబ సభ్యులతో కలిసి పంజాబ్‌లో పర్యటన కొనసాగించారు. అట్టారీ`వాఘా సరిహద్దును, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) మ్యూజియంను సందర్శించారు. భారత్`పాకిస్థాన్ సరిహద్దు అయిన జీరో పాయింట్ వద్ద బీఎస్‌ఎఫ్ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను సీజేఐ దంపతులు తిలకించారు. అట్టారీ`వాఠా సరిహద్దును సందర్శించిన తొలి సీజేఐగా జస్టిస్ ఎన్‌వీ రమణ రికార్డు కెక్కారు. అలాగే బైశాఖీ పర్వదినం సందర్భంగా పంజాబ్ ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు. సీజేఐ దంపతులు పంజాబ్ పర్యటన ప్రారంభించారు. తొలుత అమృత్‌సర్‌లో జలియన్‌వాలాబాగ్‌ను సందర్శించారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం స్వర్ణ దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.