తిరుపతి ఎమ్మెల్యేకు రెండోసారి కరోనా?
తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి రెండోసారి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఆయన వర్గీయులు మీడియా గ్రూపులో ప్రకటించారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా చర్చనీయాంశంమైంది. ఆగస్టు 25న ఎమ్మెల్యేకు పాజిటివ్ రావడంతో రుయాలో చికిత్స పొందారు. సెప్టెంబరు 3న పరీక్షలో నెగెటివ్ రావడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు. వాకింగ్ చేస్తుండగా అలసట రావడం, జ్వరం ఉండడంతో కొవిడ్ పరీక్ష చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్టు ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్నారు. కాగా ••రుణాకర్ రెడ్డికి పాజిటివ్ వచ్చినట్టు తమ అధికారిక జాబితాలో లేదని జిల్లా వైద్యాధికారులు చెప్పడం గమనార్హం.






