మరో మారు ప్రపంచ దేశాలు కలవరం!

కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యంలో రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 5.67 లక్షల మందికి వైరస్ సోకింది. 1,847 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో లక్ష మందికి పైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కొత్త కేసులో 95 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉంటాయని భావిస్తున్నట్లు వ్యాధుల నియంత్రణ నిర్మూలన కేంద్రం (సీడీసీ) పేర్కొంది. గత రెండు వారాలుగా అమెరికాలో రోజుకు సగటున 4.80 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాఠశాలలు, అసుపత్రులు, విమానాయన సంస్థలు సిబ్బంది కొరతతలో సతమతం అవుతున్నాయి. గత వారంలో రోజుకు సగటున 14,800 మంది ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు వారంతో పోలిస్తే ఇది 63 శాతం అధికంగా ఉంది.
ఐరోపా దేశాల్లో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 2,72,686 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇటలీలో 1,70,844 కేసులు నమోదయ్యీయి. 222 మంది ప్రాణాలు కోల్పోయారు. 30 వేల మంది వైరస్‌ను జయించారు. స్పెయిన్‌లో ఒమిక్రాన్ విజృంభణతో రోజువారీ కేసులు భారీ నమోదవుతున్నాయి. ఒక్కరోజే 1,17,775 మంది వైరస్ సోకింది. 116 మంది మరణించారు. 13 వేల మంది వైరస్‌ను జయించారు. బ్రిటన్‌లోనూ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్కరోజే 2,18,274 మందికి వైరస్ సోకింది. 48 మంది మరణించగా 50 వేల మంది వైరస్ ను జయించారు. ఇజ్రాయెల్‌లో రికార్డు స్థాయిలో 11,978 కరోనా కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ రెండో తేదీన నమోదైన 11,345 కేసులే ఇప్పటివరకు రికార్డు కాగా, ఇప్పుడు అతి తుడిచిపెట్టుకుపోయింది.