ప్రియాంక గాంధీకి కరోనా

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకత్వంలో ఒక్కొక్కరుగా కరోనా బారినపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రాకు కరోనా వైరస్ సోకింది. దీంతో ఆమె స్వీయ నిర్బంధంలో ఉన్నారు. నాకు కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయి. కరోనా నిబంధనలు పాటిస్తున్నాను. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నాను. గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను అని అన్నారు.