పొగ పరిశోధన…హెచ్చరిక
మీ ఇంట్లో ఎవరైనా పొగ తాగుతున్నారా. అయితే మీ పిల్లలు జాగ్రత్త. ఎందుకంటే ఇంట్లో పొగతాగేవారుంటే పొగలోని అవశేషాలు అంతా ఇల్లంతా వ్యాపిస్తాయి. ఫలితంగా చిన్నారుల చేతుల్లోనూ చెప్పుకోదగిన స్థాయిలో నికోటిన్ అవశేషాలు చేరుతున్నాయి. దీని వల్ల చిన్నారులు ఆస్తమా, ఇతర శ్వాస సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరించారు. ఆమెరికాలోని సిన్సినాటి చిల్డ్రన్స్ ఆస్సత్రిలో 25 మంది చిన్నారులపై అధ్యయనం చేశారు. వీరు స్మోకర్ వదిలిన పొగను పీల్చడం ద్వారా అనారోగ్యానికి గురైనట్లు తేలింది. అరిచేతులను పరిశీలించగా నికోటిన అవశేషాలు బయటపడ్డాయి. లాలాజలాన్ని పరిశీలించగా కాటినైట్ బయటపడింది.













