తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను స్థాపించాలి : యార్లగడ
ప్రవాసాంధ్రులు తెలుగు రాష్ట్రాల్లో వ్వవసాయ అనుబంధ పరిశ్రమలను స్థాపించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యార్లగడ లక్ష్మీ ప్రసాద్ సూచించారు. చికాగోలో నాట్స్ ముగింపు ఉత్పవాల్లో ఆయన ప్రసంగించారు. అమెరికా, ఇతర దేశాల్లో వలె వ్వవసాయ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందన్నారు. శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ ప్రవాసాంధ్రులు అమరావతిలో సాఫ్ట్వేర్ సంస్థలను ఏర్పాటు చేయాలన్నారు.








