అమెరికాలో మరో జాతి వివక్ష ఘటన
అమెరికాలో మరో జాతి వివక్ష సంఘటన చోటు చేసుకుంది. బురఖా ధరించిందని ఓ మహిళను బయటకు గెంటేశారు క్రెడిట్ యూనియన్ బ్యాంకు అధికారులు. ఉన్న పళంగా బురఖా తొలగించకపోతే పోలీసులను పిలుస్తామంటూ బెదరించారు. వివారాల్లోకి వెళితే, జమీలా మహమ్మద్ అనే మహిళా తన కారు బిల్లు కట్టేందుకు వాషింగ్టన్‌లోని సౌండ్ క్రెడిట్ బ్యాంకుకు వెళ్లింది. అయితే, తమ బ్యాంకులోకి బురఖా, టోపీలు, సన్గ్లాస్లకు అనమతి లేదంటూ బ్యాంకు అధికారులు అడ్డు చెప్పారు. అయితే బేస్‌బాల్ ప్లేయింగ్ టోపీలు ధరించిన ఇద్దరికి మాత్రం ఆమె కళ్ల ముందే ఎలాంటి అభ్యంతరమూ లేకుండా సహకరించారు. బ్యాంకు సూపర్వైజర్ నేరుగా ఆమె దగ్గరికి వచ్చి మూడు అంకెలు లెక్క పెట్టేలోగా బురఖాను తొలగించాలని, లేదంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరిస్తూ సెల్ ఫోన్‌తో వీడియో కూడా తీశాడు. దీంతో ఆమె తీవ్ర ఆవేదనకు లోనైంది. ఫేస్బుక్లో తాను ఎదుర్కొన్న జాతి వివక్షణను పంచుకుంది. తన వంటి పరిస్థితి మరొకరికి ఎదురవ్వకూడదని ఆకాంక్షించింది. కాగా దీనిపై సదరు బ్యాంకు స్పందిస్తూ జరిగిన ఘటనకు క్షమాపణలు చెప్పింది. ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చింది.








