అవసరమైతేనే నార్త్ కొరియాపై దాడి చేస్తాం: అమెరికా
అవసరమైతేనే నార్త్ కొరియాపై సైనిక దాడి చేస్తామని అమెరికా సృష్టం చేసింది. రెండు రోజుల క్రితం ఖండాంతర క్షిపణి ప్రయోగించిన నార్త్ అమెరికాపై ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ అంశాన్ని ఉద్దేశించి ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి నిక్కీ హెలీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐక్యారాజ్యసమితిలో నార్త్ కొరియా అంశంపై ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆమె సృష్టం చేశారు. ఖండాంతర క్షిపణ పరీక్షతో ఉత్తర కొరియా సైనిక ఉల్లంఘనలకు పాల్పడిందని, ఆ దేశంపై వాణిజ్య ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఐక్యారాజ్యసమితి భద్రతా మండలి విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ నార్త్ కొరియా క్షిపణి ప్రయోగించిందని ఆమె ఆరోపించారు.













