మన ఆరోగ్యంపై స్నేహితుల ప్రభావమే ఎక్కువ!
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అన్న కవి మాటలు అక్షర సత్యాలని శాస్త్రీయంగా వెల్లడైంది. ఓ వ్యక్తి ఆరోగ్యం, ఆనందాలపై కుటుంబ సభ్యుల కన్నా స్నేహితుల ప్రభావమే ఎక్కువని తాజా అధ్యయనం తేల్చింది. 100 దేశాల్లో 2.80 లక్షల మందిపై జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైందని మిచిగాన్ యూనివర్సిటీ ఆసిస్టెంట్ ప్రొఫెసర్ విలియం చోపిక్ తెలిపారు. స్నేహితుల నుంచి ఒత్తిడి వస్తే ఆరోగ్యంపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటోందని ఆయన తెలిపారు.








