ఎంప్లాయిమెంట్ బేస్డ్ వీసా అంటే?
అమెరికాలో ఇతర దేశస్థులు శాశ్వతంగా స్థిరపడేందుకు గ్రీన్ కార్డు పొందాలంటే రెండే మార్గాలు. మొదటిది ఫ్యామిలీ బేస్డ్ గ్రీన్ కార్డు. అంటే అమెరికా పౌరులను పెళ్లి చేసుకోవడం ద్వారా అక్కడ స్థిరపడడం. రెండోది ఎంప్లాయిమెంట్ బేస్డ్ (ఇబి) వీసా. ఈ విధానంలో వేర్వేరు రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ ఉన్న వ్యక్తులకు కంపెనీల సహకారంతో అమెరికాలో శాశ్వత నివాసం ఉండే అవకాశం కల్పిస్తారు. ప్రతిభావంతులైన ప్రొఫెసర్లు, పరిశోధకులు, మల్టీనేషనల్ ఎగ్జిక్యూటివ్స్ మేనేజర్లు ఈ కేటగిరిలోకి వస్తారు.








