ఆస్థమాను గుర్తించే సరికొత్త సెన్సర్!
ఆస్థమా వంటి శ్వాస సంబంధిత వ్యాధులను గుర్తించడంతోపాటు చికిత్స లోనూ దోహదపడగల సరికొత్త సెన్సర్‌ను అమెరికాలోని రట్జెర్స్ విశ్వవిద్యాలయ పరిశోధకులు అభివృద్ధి చేశారు. గ్రాఫీన్ ఆక్సైడ్ సాయంతో ఈ పరికరాన్ని వారు తయారుచేశారు. ధరించడానికి వీలుగా ఉండటం దీని ప్రత్యేకత. ప్రస్తుతం విపణిలో అందుబాటులో ఉన్న ఫిట్‌బిట్ పరికరాలను ఇది పోలి ఉంటుంది. వ్యక్తులు ఈ పరికరంలోకి నోటీద్వారా గాలిని వదిలాలి. సదరు శ్వాసలోని జీవసూచిక (నైట్రైట్ స్థాయి)లను విశ్లేషించి, ఆస్థమా, ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధుల ముప్పును పరికరం ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. తద్వారా బాధితులు ముందుగానే అప్రమత్తమయ్యేందుకు దోహదపడుతుంది.













