వీటీ సేవ సంస్థ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసిలో 5వేల మందికి అన్నదానం
వాషింగ్టన్ డీసిలో గూడులేని పేదలకు వీటీ సేవ సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. దాదాపు 5వేలమంది పేదలకు అన్నదానం చేసినట్లు ఏరియా కో ఆర్డినేటర్ శ్రీధర్ నాగిరెడ్డి, సుబధ గ్రూపుకు చెందిన రీనా బొమ్మసాని తెలిపారు. దాదాపు 40 మంది యువకులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. చినజీయర్ స్వామి శిష్యులైన వీరు ఎన్నో సేవా కార్యక్రమాలను వీటీ సేవ పేరుతో నిర్వహిస్తున్నారు.








