ట్రంప్ నాకు వధువు కాదు… ఆయనకు నేను వరుడినీ కాదు
అగ్రరాజ్యల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో ఆగాధం పెరిగిపోతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై వ్యక్తిగత విమర్శలు చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ నిరాకరించారు. రష్యా పట్ల ట్రంప్ వైఖరి మిమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచిందా అని మాస్కోలో విలేకరులు అడిగిన ప్రశ్నకు పుతిన్ సూటిగా సమాధానమివ్వలేదు. ట్రంప్ నాకు వధువు కాదు, ఆయనకు నేను వరుడినీ కాదు అంటూ పుతిన్ స్పందించారు. ఒకవేళ ట్రంప్ పదవీచ్యుతుడైతే రష్యా ఎలా భావిస్తుంది అన్న మరో ప్రశ్నకు పుతిన్ వెంటనే ప్రతిస్పందిస్తూ అమెరికా అంతర్గత రాజకీయాలను రష్యా చర్చించటం మహాపరాధమే అని పేర్కొన్నారు.













