విశ్వకర్మ ఫ్యామిలీ మీట్‌కు విశేష స్పందన
శాన్‌హోసెలో జరిగిన విశ్వకర్మ ఫ్యామిలీ మీట్‌కు అమెరికాలో ఉన్న విశ్వకర్మ కుటుంబాలకు చెందిన వారు పాల్గొని ఉల్లాసంగా గడిపారు. ఆగస్టు 5వ తేదీన హెల్లెయర్ కౌంటీ పార్క్ లోని బటిస్టా పిక్ సైట్ లో జరిగిన ఈ మీట్‌కు మంచి స్పందనే వచ్చింది. తొలుత భగవాన్ విశ్వకర్మకు దీపారాధన చేయడంతో కార్య క్రమాలు ప్రారంభమయ్యాయి. రమేష్ తంగెళ్లపల్లి, వెంకట్ చలపతి, ఓం, జంగయ్య, చారి, అమరనాధ్ చిన్నోజు వంటి వారు దీపం వెలిగించి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా, మిగతా వారు చప్పట్లతో వారిని స్వాగతించారు. రమేష్ తంగెళ్లపల్లి విశ్వకర్మ కుటుంబ చరిత్ర గురించి ప్రస్తావించగా, మిగతావారు తమ కుటుంబాలు ఎక్కడ ఉంటుంది. ఏం చేస్తుంది. తమ జాతి ఐక్యత కోసం తీసుకోవాల్సిన అంశాల గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా మీట్ అయిన వారంత తమను తాము పరిచయం చేసుకున్నారు.
ఈ సందర్భంగా వీణ గుండవల్లి ఙఱరష్ట్రషaసaతీఎaటaఎఱశ్రీవ.శీతీస్త్ర పేరుతో వెబ్సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో అందరూ పాల్గొన్నారు. విందు భోజనం చేశారు. పాటలు, ఆటల పోటీల్లో అందరూ పాల్గొన్నారు. ఇండియానా పోలీస్ నుంచి వచ్చిన వెంకట్ చలపతితో పాటు 100 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి మరెన్నో ఆత్మీయ సమ్మేళనాలు జరగాలని విశ్వకర్మ కుటుంబీకులు కోరారు. రమేష్ తంగెళ్లపల్లి ఈ వేడుకలకు నేతృత్వం వహించగా, గట్టిపల్లి, శివరాపు, వీరయ్య గారి, గుండవెల్లి విశ్వకర్మ కుటుంబాలు వారికి అండగా నిలిచాయి. తమ విలువైన సమయం వెచ్చించడమే కాకుండా విశ్వకర్మ కుటుంబాల్లో ఉన్న ఐక్యమత్యాన్ని ప్రదర్శించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు రమేష్ తంగెళ్లపల్లి. అదే విధంగా ఈ కార్యక్రమానికి తమ సహాయం, సేవలందించిన రాజేష్ మల్లం, రామ్ సేన్ బొజ్జా, కాసుల వేణులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.













