హెచ్ 1బీ వీసాలకు వెసులుబాటు
అమెరికాకు వలస వచ్చే ఉన్నతస్థాయి సాంకేతిక ఉద్యోగులకు సంబంధించి, హెచ్1బీ వీసాల జారీకి సంబంధించి ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన కఠిన వైఖరిని కాస్త సడలించుకున్నట్లు కనిపిస్తున్నది. ఉన్నత స్థాయి నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు అమెరికాకు రప్పించుకోవటంలో అవంతరాలు లేకుండా చూస్తానంటూ ఐటీ కంపెనీలకు ట్రంప్ భరోసా ఇచ్చారు. హైటెక్ నైపుణ్యం ఉన్న వ్యక్తులను ప్రత్యేక వ్యక్తలుగా పేర్కొంటూ, మీరు కోరుకునే వ్యక్తులు మీ కంపెనీలకు వచ్చేలా చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు. సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో ట్రంప్ వైట్‌హౌస్‌లో సమావేశమయ్యారు. మరోవైపు అమెరికా హెచ్-1బీ వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించనున్నట్లు తెలుస్తున్నది.








