వీసా మంజూరు మరింత కట్టుదిట్టం
వీసాల మంజూరు ప్రక్రియను మరింత కట్టుదిట్టంగా నిర్వహించాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ దేశ దౌత్య కార్యాలయాలను అమెరికా ఆదేశించింది. పర్యాటక, వ్యాపార వీసాలు సహా ఏ తరహా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాసరే. దరఖాస్తుదారుల ఉద్యోగం, గత 15 ఏళ్లుగా ఎక్కడ నివాసముంటున్నారు. గత ఐదేళ్లలో ఉపయోగించిన ఫోన్ నంబర్లు, పంపిన ఈ-మెయిళ్లు, వినియోగించిన సామాజిక మాధ్యమ ఖాతాలు వంటి అన్ని వివరాలు తెలుసుకోవాల్సిందిగా డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ నెల 15న సూచించింది.







