దేశ భద్రత కోసమే వీసాలు రద్దు
దేశ భద్రత కోసమే కొన్ని దేశాలకు వీసాలు రద్దు చేసినట్లు అమెరికా పేర్కొంది. అంతేతప్ప అది ఏ మతానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని ఆ దేశం సృష్టం చేసింది. ఆరు ముస్లిం దేశాల వారికి వీసాలు ఇవ్వకూడదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని యూఎస్ అప్పీల్స్ కోర్టు వ్యతిరేకించిన నేపథ్యంలో అమెరికా అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ ఈ వివరణ ఇచ్చారు.








