నికోటిన్ తగ్గిస్తే సిగరెట్‌కు గుడ్‌బై
సిగరెట్లలో నికోటిన్ పరిమాణాన్ని తగ్గిస్తే ధూమపాన వ్యసనానికి చెక్ పెట్టొచ్చని తాజా అధ్యయనంలో తేలింది. రోజూ సిగరెట్ తాగే 169 మంది (120 మంది స్త్రీలు, 49 మంది పురుషులు)ని మూడు వర్గాలుగా విభజించి వారికి ఇచ్చే సిగరెట్లో మూడు దశలుగా నికోటిన్ శాతాన్ని తగ్గించుకుంటూ కాల్చుమని చెప్పినపుడు వారు పొగ తాగడానికి ఇష్టపడలేదని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వెర్మాంట్ పరిశోధకులు తెలిపారు. నికోటిన్ పరిమాణం బాగా తగ్గినపుడు సిగరెట్ తాగకుండా ఉండేందుకు ఇష్టపడ్డారని, ఇలా చేస్తే వ్యసనపరులను సులభంగా సిగరెట్‌కు గుడ్‌బై చెప్పించొచ్చని వెల్లడించారు.













