గ్రీన్ కార్డు ఇంటర్వ్యూలు అక్టోబర్‌లో…
అమెరికాలో హెచ్ 1 బి వీసాపై వచ్చి పనిచేస్తున్న భారతీయులు శాశ్వత నివాసంకోసం అవసరమైన గ్రీన్‌కార్డ్‌ను పొందాలంటే ఇప్పుడు చాలా కష్టపడవలసి వస్తుంది. గతంలోలాగా సులువుగా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ట్రంప్ వచ్చిన తరువాత ఇమ్మిగ్రేషన్ విధానంలో వచ్చిన మార్పులే దీనికి కారణం. గ్రీన్‌కార్డ్ కావాల్సినవారందరికీ అక్టోబర్ 1 నుంచి యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ (యూఎస్సీఐఎస్) నేరుగా ఇంటర్వ్యూలను నిర్వహించనుంది. దరఖాస్తు దారులు తప్పనిసరిగా ఈ ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. సాంకేతికంగా మార్పులు చేస్తూ ఆగస్టు 28న ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.













