అమెరికన్ ఉద్యోగాలకు భారీ ముప్పు
ఇప్పటికే ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతున్న అమెరికన్లకు మరో బ్యాడ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా లక్షల కొద్ది వర్కర్లు తమ ఉద్యోగాలను రోబోట్లకు వదులుకోవాల్సి వస్తుందని, దానిలో ముఖ్యంగా అమెరికా ఎక్కువగా ప్రభావితం కానుందని తాజా రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. రోబోట్స్, ఆప్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే పదిహేనేళ్లలో దాదాపు 38 శాతం అమెరికన్ ఉద్యోగాలు ప్రమాదంలో పడనున్నాయని పీడబ్ల్యూసీ తాజా రిపోర్టు వెల్లడించింది. అదేవిధంగా యూకేలోనూ 30 శాతం ఉద్యోగాలు పోనున్నాయని పేర్కొంది. ఇదే రకమైన ప్రమాదం జపనీస్లకు పొంచి ఉందని తెలిసింది.













