మళ్లీ పాక్‌కు చెయ్యిచ్చిన అమెరికా
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నాటి నుంచి ఉగ్రవాదం వ్యవహారంపై పాకిస్థాన్ చేస్తున్న వైఖరి గర్హిస్తూ వస్తూను ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా అమెరికా జాతీయ రక్షణ వ్వవస్థ చట్టపరిధిలో హక్కాని నెట్ వర్క్‌పై పాక్ సరిగా వ్యవహరించడంలేదని విరుచుకు పడింది. ఈ మేరకు పెంటగాన్ అధికార ప్రతినిధి అడమ్ స్టంప్ మీడియాతో మాట్లాడుతూ హక్కాని నెట్ వర్క్ మీద చర్యలు తీసుకోవాలని సృష్టమైన ఆదేశాలు జారీ చేసిన పాక్ ప్రభుత్వం నిబద్దతతో వ్యవహరించలేదని, కనీస చర్యలు చేపట్టలేదంటూ అమెరికా రక్షణశాఖ కార్యదర్శి జిమ్ మటీస్ కాంగ్రెస్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొనట్లు వివరించారు. ఈ కారణంగానే 2016 ఆర్థిక సంవత్సరంలో అమెరికా నుంచి పాకిస్థాన్‌కు అందాల్సిన నిధులను నిలిపి వేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు స్టంప్ సృష్టం చేసారు.








