త్వరలో భారత్ రానున్న మైక్ పెన్స్
భారత పర్యటనలో భాగంగా చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కార్యాలయాన్ని సందర్శించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ ఆసక్తి వెలిబుచ్చారు. అమెరికా -భారత్ బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబీసీ)వార్షిక సమావేశాల్లో భాగంగా స్పైస్‌జెట్ అధిపతి అజేయ్ సింగ్‌తో పెన్స్ సమావేశమయ్యారు. అమెరికా విమానాల తయారీ సంస్థ బోయింగ్‌తో 100 కొత్త విమానాల సరఫరాలకు స్పైస్‌జెట్ ఒప్పందం కుదుర్చుకున్నందుకు పెన్స్ కృతజ్ఞతలు తెలిపారు. తద్వారా అమెరికాలో అధిక విలువ కలిగిన ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారని స్పైస్‌జెట్ అధికార ప్రతినిధి వెల్లడించారు.








