భారత్ కు డ్రోన్ల ఎగుమతికి డీఎస్పీ-5 లైసెన్సులు
మన దేశానికి ఎగుమతి కావాల్సిన 22 ప్రిడేటర్ గార్డియన్ డ్రోన్లకు సంబంధించిన లైసెన్సును అమెరికా విదేశాంగశాఖ జారీ చేసింది. డీఎస్పీ-5 తరగతికి చెందిన ఈ లెసెన్సుతో అంతర్జాతీయ ఆయుధాల సరఫరా నియంత్రణలకు లోబడి మన దేశానికి సైనిక హార్డ్వేర్ శాశ్వత ప్రాతిపదికన ఎగుమతి అవుతుంది. ఇటీవల అమెరికాలో పర్యటించిన ప్రధాని మోదీ, అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ సమక్షంలో డ్రోన్ల కొనుగోలుపై ఒప్పందం జరిగిన విషయం విదితమే. మానవ రహిత వాహనాల తయారీలో అగ్రగామి సంస్థ అయిన జనరల్ అటామిక్స్ అనే కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ డ్రోన్ల విలువ దాదాపు రూ.12,900 కోట్లు. ఈ ఒప్పందం కుదరడం వెనుక, ఇంత తర్వగా భారత్కు ఎగుమతి చేయడంలోనూ గతంలో బోయింగ్ కంపెనీలో పనిచేసి, ప్రస్తుతం జనరల్ అటామిక్స్లో కీలకభూమిక పోషిస్తున్న వివేక్లాలా ఎంతో కృషి చేశారు.








