అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తిగా భారతీయ అమెరికన్
అమెరికాలో శక్తిమంతమైన అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తిగా ప్రముఖ భారతీయ అమెరికన్ అమూల్ థాపర్ (48) నియామకానికి సెనేట్ ఆమోదం తెలిపింది. అమెరికా 6వ సర్క్యూట్ అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తిగా అమూల్‌ను దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్చి 21న నామినేట్ చేశారు. ఆయన నామినేషన్‌ను సెనేట్ తాజాగా 52-44 ఓట్ల తేడాతో ఆమోదించింది. దక్షిణాసియా ప్రాంతానికి చెందిన వ్యక్తి అప్పీళ్ల కోర్టు న్యాయమూర్తిగా నియమితులవడం ఇది రెండోసారి మాత్రమే కావడం గమనార్హం. సుప్రీంకోర్టు నామినీలుగా అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ విడుదల చేసిన జాబితాలోనూ అమూల్ పేరుంది.













