సంస్థల హెచ్-1బి వీసాల సత్వర జారీని పునరుద్ధరిస్తాం : అమెరికా
ఉన్నత విద్యా సంస్థలు, లాభాపేక్ష లేని సంస్థలు, ప్రభుత్వ పరిశోధన సంస్థలు కోరే హెచ్-1బి వీసాల సత్వర జారీకి గతంలో ఉన్న ప్రక్రియను పునరుద్ధరించనున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. వీసాలను వాడే కంపెనీలు మాత్రం అనుమతి నిమిత్తం ఎక్కువ సమయం నిరీక్షించక తప్పదని సృష్టం చేసింది. నెలల తరబడి నిరీక్షించాల్సిన అవసరం లేకుండా 15 రోజుల్లోనే వీసాల జారీకి ప్రీమియం ప్రాసెసింగ్ పేరుతో ఉన్న పద్ధతిని ఆరు నెలల పాట నిలిపివేస్తున్నట్లు ఏప్రిల్ 3న అమెరికా ప్రకటించింది.








