హెచ్ 1-బి వీసాలు వేగంగా ప్రాసెస్ చేస్తాం : అమెరికా
అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణుల హెచ్1బి వీసాలను వేగంగా ప్రాసెస్ చేస్తామని అమెరికా ప్రకటించింది. కొన్ని విభాగాలకు చెందిన హెచ్1బి పిటిషన్లను తక్షణం పరిష్కరించే విధానాన్ని అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగేష్రన్ సర్వీసెస్ (యుఎస్సిఐఎస్) పునరుద్ధరిస్తునట్లు ఓ అధికారిక ప్రకటనలో తెలిపారు. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో 65వేల హెచ్1బి వీసాలు మాత్రమే ఇస్తారు. అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ లేదా ఉన్నత విద్యలు చేసిన మరో 20 వేల మందికి కూడా మాస్టర్ క్యాప్ కోటాలో ఇస్తారు.













