వలసదారులకు డొనాల్డ్ ట్రంప్ షాక్
అమెరికాకు వలస వచ్చే విదేశీయులకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. తమ దేశానికి వచ్చే వలసదారులు తొలి ఐదేళ్లలో ఎలాంటి సంక్షేమ పథకాలు తీసుకోరని ట్రంప్ సృష్టం చేశారు. మీరు మా దేశానికి వచ్చిన తర్వాత ఐదేళ్ల వరకు ఎలాంటి సంక్షేమాలు రావు. గతంలో లాగా వచ్చిన వెంటనే సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడం ఇకపై ఉండదు అని ట్రంప్ తన వారంతపు రేడియో, వెబ్ ప్రసంగంలో చెప్పారు.








