రష్యాకు అమెరికా షాక్
శాన్ఫ్రాన్సిస్కోలోని రష్యా దౌత్య కార్యాలయాన్ని అమెరికా ఆదీనంలోకి తీసుకుంది. న్యూయార్క్, వాషింగ్టన్ డీసీలలోని మరో రెండు రష్యా దౌత్య సదుపాయాలను సైతం స్వాధీనపరచుకొంది. వీటిని రెండు రోజుల్లోగా ఖాళీ చేయాలని ట్రంప్ సర్కార్ ఆదేశించిన సంగతి తెలిసిందే. తమ దేశంలో అమెరికా దౌత్య సిబ్బంది సంఖ్యను భారీగా తగ్గించాలని రష్యా నిర్ణయించిన నేపథ్యంలో ట్రంప్ స్పందించారు. ట్రంప్ ఆదేశాలను అనుసరించి రష్యా ప్రభుత్వం దౌత్య కార్యాలయాలను ఖాళీచేసింది అని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి తెలిపారు. వీటిని స్వాధీనం చేసుకున్నప్పటికీ రష్యా దౌత్యవేత్తలెవరినీ దేశం నుంచి బహిష్కరించలేదని వివరించారు.













