హెచ్-1బీ దుర్వినియోగాన్ని నివారించాలి
హెచ్-1బీ వీసా కార్యక్రమం దుర్వినియోగం కాకుండా శాసనకర్తలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని ప్రముఖ భారతీయ అమెరికన్, ప్రతినిధుల సభ సభ్యుడు రో ఖన్నా అన్నారు. అట్లాంటిక్ మండలి దక్షిణాసియా కేంద్రం (ఎస్ఏసీఏసీ) నిర్వహించిన కార్యక్రమంలో ఖన్నా మాట్లాడారు. సదరు వీసాలు దుర్వినియోగమైతే, అమెరికాలోని నిపుణుల రాక తగ్గిపోతుందని, దేశ ఉద్యోగ విపణి క్షీణిస్తుందని అన్నారు.








