మా విమానాల్లో ల్యాప్ ట్యాప్ తీసుకెళ్లవచ్చు…
అమెరికా వెళ్లే విమానాల్లో ల్యాప్‌టాప్‌ను తీసుకెళ్లరాదు అన్న నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ఎమిరేట్స్ విమానసంస్థ పేర్కొన్నది. అమెరికా విధించిన నిషేధం తమకు వర్తించదు అని ఆ సంస్థ తాజగా వెల్లడించింది. ఎనిమిది ముస్లిం దేశాల నుంచి వస్తున్న విమానాలపై అగ్రరాజ్యం అమెరికా కొన్ని ఆంక్షలు పెట్టింది. విమానాల్లో ల్యాప్‌టాప్‌ను అనుమతించరాదు అని ఆర్డర్ చేసింది. ఆ దేశాలతో ఎమిరేట్స్, ఇథియాద్ లాంటి విమాన సంస్థలు కఠిన నియమాలను అమలు చేయాల్సి వచ్చింది.
ఉగ్రవాదులు ల్యాప్‌టాప్ బాంబులతో దాడి చేసే అవకాశం ఉందన్న అనుమానంతో అమెరికా వాటిపై నిషేదం విధించిది. అయితే ఆ నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఎమిరేట్స్ సృష్టం చేసింది. కొత్త తరహా సెక్యూర్టీ నియమావళిని అవలంబిస్తామని అమెరికా అధికారులకు హామీ ఇచ్చినట్లు ఎమిరేట్స్ సంస్థ పేర్కొన్నది. అమెరికాలోని 12 నగరాలకు ఎమిరేట్స్ విమానాలు వెళ్తున్నాయి. అబూదాబీకి చెందిన ఇథియాద్ విమానాలపైన కూడా అమెరికా ల్యాప్‌టాప్ నిషేధాన్ని ఎత్తివేసింది.













